సత్యసాయి: పెనుకొండలోని టీడీపీ కార్యాలయం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మంత్రి సవిత ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. టీడీపీ అర్బన్ కన్వీనర్ శ్రీరాములు మాట్లాడుతూ.. ఆయన త్యాగంతోనే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు.