కోనసీమ: జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 230 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జేసీ నిశాంతి మాట్లాడుతూ.. అర్జీదారులు అందజేసిన సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మమ్మీ, పీడీ మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.