BDK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అంకిత్ ఆధ్వర్యంలో ఇవాళ ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ వినతులను స్వీకరించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.