»Tulasi Kokapet Aunty Video Viral 100 Crore Record Rates Per Acre Neopolis
Video viral: కోకాపేట ఆంటీ వీడియో ట్రోలింగ్..ఎకరానికి రికార్డు స్థాయిలో రేట్లు
కోకాపేట(Kokapet)లో భూమి(lands) అమ్మితే.. లెక్కలేనంత డబ్బు వస్తుందని తులసి సినిమాలో కోకాపేట ఆంటీ పదహారేళ్ల కిందే చెప్పగా.. ఇప్పుడు అదే నిజమైంది. హెచ్ఎండీఏ(HMDA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-వేలంలో కోకాపేట భూములు హైదరాబాద్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా.. ఆల్‌టైం రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఒక్క ఎకరానికి ఏకంగా వంద కోట్లకు పైగా వచ్చాయి.
కోకాపేట(Kokapet) భూములకు(lands) కోట్లాది రూపాయల డిమాండ్ రావడం దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా తెలుగు సినీ ప్రియులు..16 ఏళ్ల కింద తులసి సినిమాలో కోకాపేట ఆంటీ చెప్పిన డైలాగులు గుర్తు చేసుకుంటున్నారు. దీంతో ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. 2007లో వెంకటేష్, నయనతారా హీరో హీరోయిన్లుగా తులసి సినిమా వచ్చింది. బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన ఆ సినిమాలో.. కోకాపేట ఆంటీ పాత్రలో ప్రముఖ యాంకర్ ఝాన్సీ నటించింది. తన నటనా చాతుర్యంతో అలరించింది. ఈ పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలిచింది. కోకాపేట ఆంటీ క్యారెక్టర్ తులసి సినిమాలో స్థలం అమ్మిన డబ్బులతో ఒక్కసారిగా ధనికురాలైన పాత్రతో కామెడీ చేస్తూ నవ్వులూ పూయించింది. కానీ..అది మాత్రం కామెడీ కాదు.. అక్షరాలా నిజమని ఇప్పుడు నిరూపితమైంది.
కోకాపేట నియోపోలీస్(neopolis) లేఅవుట్లో 6 నుంచి 14 నెంబర్ ప్లాట్లకు ఆగస్టు ౩వ తేదీన వేలం నిర్వహించారు. ఇందులో పదో నెంబర్ ప్లాట్‌లో ఒక ఎకారానికి అత్యధికంగా 100 కోట్ల 75 లక్షల రూపాయలు పలికింది. దీంతో.. 10 నెంబర్ ప్లాట్‌లో 3.60 ఎకరాలుండగా ఏకంగా 360 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక మొత్తంగా 3 వేల కోట్లకు పైగానే ఆదాయం వచ్చింది. అయితే.. హెచ్ఎండీఏ అధికారులు సుమారు 2 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆకాంక్షించగా.. వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ.. ఏకంగా 3 వేల కోట్లు రావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. రియల్టర్లు ఎగబడీ మరీ భూములను దక్కించుకున్నారు. కోకాపేట భూములంటే ఎంతో రిచ్చు అన్న.. కోకాపేట అంటీ మాటను నిజం చేశారు.