»A New Show Hosted By Manchu Manoj At Etv Win Ott Platform
Manchu Manoj: మంచు మనోజ్ హోస్ట్ గా సరికొత్త షో!
ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు గ్రూప్, వారి డిజిటల్ విభాగం ETV విన్ యాప్ OTT రంగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే పాత చిత్రాలతోపాటు ఇటివల రవిబాబు హీరోగా నటించి సినిమాలను కూడా రిలీజ్ చేశారు. దీంతోపాటు మరికొన్ని షోలను కూడా ఈ యాప్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఓటీటీ నుంచి త్వరలోనే హీరో మంచు మనోజ్(manchu manoj) ఓ షో హోస్ట్ చేయనున్నట్లు తెలిసింది.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్(manchu manoj)ని మనం చివరిగా బుల్లితెరపై చూసి ఐదేళ్లు పూర్తయింది. ఇటీవలే మంచు నటుడు దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ నటుడు ప్రస్తుతం “అహం బ్రహ్మాస్మి, వాట్ ది ఫిష్ వంటి పలు మూవీ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ హీరో గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన బజ్ సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.
మంచు మనోజ్ ఈటీవీ OTT ప్లాట్‌ఫారమ్ ETV విన్(etv win) కోసం టాక్ షోను హోస్ట్ చేయబోతున్నట్లు తెలిసింది. అయితే ఈ కార్యక్రమానికి మనోజ్ హోస్ట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రఖ్యాత ప్రొడక్షన్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని సినీ వర్గాలు అంటున్నారు. ఈ షో గురించిన మరిన్ని వివరాలు త్వరలో రిలీజా కానున్నాయి.
మరోవైపు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి(chandrababu)ని కూడా మనోజ్ తన భార్యతో కలసి వెళ్లి పలకరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి కూడా మనోజుకు ఇచ్చే అవకాశం ఉందని మరికొంత మంది అంటున్నారు. అంతేకాదు నంద్యాల నుంచి వీరి ఫ్యామిలీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉందని పలువురు చెబుతున్నారు.