ATP: గుత్తి మండలంలో సోమవారం పదవ తరగతి పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం ఆరు సెంటర్లలో 1518 మంది విద్యార్థులకు గాను 1492 మంది విద్యార్థులు హాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి రవి నాయక్ తెలిపారు. 26 మంది విద్యార్థులకు గైర్హాజరు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.