KNR: CKM కళాశాలలో పనిచేస్తూ ప్రభుత్వం ద్వారా టేకోవర్ అయి వివిధ ప్రభుత్వ కళాశాలల్లో నియామకం పొందిన 20 మంది అధ్యాపకులు కరీంనగర్లో TGCGTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కళాశాల విద్యా ఐకాస ఛైర్మన్ డా. కడారు సురేందర్ రెడ్డిని కలిసి సంఘ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.