AKP: ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని పదవ తరగతి విద్యార్థులకు కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. స్థానిక జీవీఎంసీ ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్‌ను ఆదివారం పరిశీలించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. విద్యార్థులతో పాటు సిబ్బంది పరీక్షల నిబంధనలను విధిగా పాటించాలన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు.