Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
మేషం
కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం వస్తోంది. ఇతరులకు ఉపకారం చేసే పనిలో ఉంటారు. స్త్రీల వల్ల లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధ తొలగిపోతాతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
వృషభం
గొప్పవారి పరిచయం కలుగుతుంది. స్త్రీల వల్ల లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు.
మిథునం
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులను కోరుకుంటారు. మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధన నష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.
కర్కాటకం
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తోంది. బంధు, మిత్రులతో గొడవలు పడొద్దు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించాల్సి ఉంటుంది.
సింహం
నూతన వ్యక్తులను నమ్మడం అంత మంచిది కాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది.
తుల
ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
వృశ్చికం
తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
ధనుస్సు
కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులు పూర్తి అవుతాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. స్థిరనివాసం ఉంటుంది. వ్యవసాయం వల్ల లాభం పొందుతారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
మకరం
నూతన కార్యాలకు చేపడుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొందతారు.
కుంభం
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. ధనవ్యయం అవుతుంది.
మీనం
ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం వస్తోంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు.