మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్ గురించి తన తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కళ్యాణి సినిమాల్లోకి వస్తుందని మేం ఎప్పుడూ అనుకోలేదు. ఆర్కిటెక్ట్ కావాలన్నది తన డ్రీమ్. ఓ రోజు నాగార్జున కాల్ చేసి ‘హలో!’ మూవీలో హీరోయిన్గా మీ అమ్మాయిని అనుకుంటున్నామన్నారు. కానీ కళ్యాణికి నటన రాదని చెప్పా. కానీ ఒకసారి ప్రయత్నిస్తా నాన్న అని ముందడుగు వేసింది’ అని అన్నాడు.