TG: కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల కోసం 4 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. మైనార్టీలకు సాధ్యమైనంత వరకు అండగా ఉంటుందని తెలిపారు. మైనార్టీ నేత అజారుద్దీన్ను మంత్రి వర్గంలోకి తీసుకున్నామని చెప్పారు. షబ్బీర్ అలీని ప్రభుత్వం సలహాదారుగా, 8 మంది మైనార్టీలను వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించమని వెల్లడించారు.