ATP: అనంతపురం 43వ డివిజన్లో ఇర్ఫాన్, ఇమ్రాన్ సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీలో YCP జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేదలకు నిత్యావసరాలు అందజేయడం హర్షణీయమని ఆయన కొనియాడారు. రంజాన్ త్యాగానికి ప్రతీక అని, అందరూ సోదరభావంతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.