VSP: పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడుల సమీకరణ అవసరమని మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన మాట్లాడారు. జూన్ నాటికి రాష్ట్రంలో 2.60 లక్షల గృహాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విశాఖ మెట్రోపై సాంకేతిక ప్రక్రియలు రెండు నెలల్లో పూర్తవుతాయని, మూడు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.