MBNR: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు నాగేందర్ ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదివారం వారికి మాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి భౌతికకాయానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.