MHBD: తొర్రూరు మున్సిపాలిటీలోని 2వ వార్డులో మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్ కమిషనర్ శ్యాంసుందర్తో కలిసి ఇవాళ పర్యటించారు. డ్రైనేజీ కాలువల్లో పూడిక, నీటి నిలుపుదలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.