tomato: టమాట (tomato) ధర ఒక్కసారిగా పెరిగింది. దీంతో టమాట (tomato) వేయాలంటేనే మహిళలు కాస్త ముందు వెనకా ఆలోచించరు. ప్రతీ రోజూ టమాట వాడేవారు కూడా థింక్ చేసి, చేసి మరీ వాడారు. వినియోగదారుల సంగతి అంటు ఉంచితే.. రైతులకు లాభాలను తెచ్చిపెట్టింది. అందరికీ కాదు.. కొందరికే మేలు జరిగింది. ఆ కోవలో మహిపాల్ రెడ్డి దంపతులు నిలుస్తారు. ఈ సీజన్లో టమాటల ద్వారా రూ.3 కోట్లను ఆర్జించారు. రూ.2 కోట్ల విలువగల టమాటలు ఇప్పటికే విక్రయించగా.. మరో రూ.కోటి విలువగల టమాట క్రాప్ మార్కెట్లోకి రావాల్సి ఉంది.
40 ఎకరాల్లో సాగు
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్‌కు చెందిన బాన్స్వాడ మహిపాల్ రెడ్డి (40) టమాట (tomato) సాగుపై దృష్టిసారించారు. ఈ ఏప్రిల్ నెలలో 40 ఎకరాల్లో సన్ షేడ్ టెక్నిక్ ఉపయోగించి క్రాప్ తీశాడు. మార్కెట్లోకి టమాట (tomato) వచ్చేసరికి ధర ఆమాంతం పెరిగింది. ఇంకేముంది మహిపాల్ రెడ్డి పంట పండింది. డిమాండ్‌కు సరిపడ టమాట మార్కెట్లో లేదు. చిత్తూరు జిల్లాలో గల మదనపల్లె నుంచి హైదరాబాద్ మార్కెట్‌కు ఆశించిన స్థాయిలో టమాట (tomato) రాలేదు. మదనపల్లెలో కిలో టమాట రూ.150 చొప్పున విక్రయించారు. హైదరాబాద్ మార్కెట్లో మహిపాల్ రెడ్డి హోల్ సేల్‌గా కిలో రూ.100కి ఇచ్చారు. అలా గత నెలలో 8 వేల బాక్స్‌లను విక్రయించాడు. ఒక్కో బాక్స్‌లో 25 కేజీల బాక్స్ పడుతుంది. ఇలా రూ.2 కోట్లను సంపాదించాడు. మరో రూ.కోటి విలువ గల టమాట (tomato) విక్రయించాల్సి ఉంది.
ఆధునాతన పద్ధతులు
టమాటలకు (tomato) డిమాండ్ ఉన్న సమయంలో విక్రయించి మంచి లాభాలను ఆర్జించాడు మహిపాల్ రెడ్డి. సోమవారం మహిపాల్ రెడ్డి దంపతులు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ప్రగతి భవన్ వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆ సమయంలో మంత్రులు హరీశ్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నారు. లాభాలను వచ్చే పంట వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్త పద్దతుల ద్వారా టమాట సాగుచేసి, అధిక దిగుబడి తీశారని ప్రశంసించారు. మహిపాల్ రెడ్డి దంపతులు మిగతా రైతులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు.
నాలుగేళ్ల నుంచి సాగు
ఈ సారే కాదు గత నాలుగేళ్ల నుంచి మహిపాల్ రెడ్డి టమాట (tomato) సాగు చేస్తున్నాడు. 40 ఎకరాల భూమిలో టమాట (tomato) పండిస్తున్నాడు. గత మూడేళ్ల నుంచి అతనికి నష్టాలు వచ్చాయి. అయినప్పటికీ వెనుదిరగలేదు. సాధించాలనే తపనతో.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్నేహితులను కలిసి వారి అభిప్రాయం తీసుకున్నాడు. సన్ షేడ్ టెక్నిక్ ద్వారా టమాట (tomato) సాగు తీశాడు. టెంపరేచర్ తగ్గించడంతో మంచి సాగు వచ్చింది. అలా మహిపాల్ రెడ్డి ఇంట సిరులు కురిపించింది.