SRD: నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మైనార్టీ మహిళలకు మున్సిపల్ వైస్ ఛైర్మన్ దారం శంకర్ ఆదివారం రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ మేరకు మైనార్టీ మహిళలకు రంజాన్ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 2 వార్డు కౌన్సిలర్ సురేఖ, నాయకులు షరీఫ్ ఉన్నారు.