»Bhagavad Gita Hymn In The Romance Scene Criticism On That Movie
Oppenheimer: శృంగారం సీన్లో భగవద్గీత శ్లోకం.. ఆ సినిమాపై విమర్శలు
హాలీవుడ్ మూవీలో రొమాన్స్ సీన్ వచ్చినప్పుడు భగవద్గీత శ్లోకం వాడారు. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఆ సీన్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
హాలీవుడ్ చిత్రం ఓపెన్‌హైమర్(Oppenheimer) ఇండియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఆ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఆ మూవీలో హీరో చెప్పిన డైలాగ్ ఇప్పుడు వివాదాస్పదమైంది. శృంగార సన్నివేశం సమయంలో భగవద్గీత శ్లోకాన్ని వాడారు. దీంతో ఆ మూవీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటామ్ బాంబు కనిపెట్టిన శాస్త్రవేత్త జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.
వైరల్ అవుతోన్న వీడియో:
A scene from the movie 'Oppenheimer' showing Cillian Murphy's character reading a quote from Bhagavad Gita while having sex with Florence Pugh character has led to a debate on social media. People questioned the censor board for allowing the scene. How board allow this scenes? pic.twitter.com/Ni9XnmslV7
రొమాన్స్ చేసుకునేటప్పుడు హీరో భగవద్గీత శ్లోకాన్ని(Bhagavat) చెబుతాడు. ఆ సీన్‌పై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వెంటనే ఆ సీన్‌ను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బాయ్‌కాట్ ఓపెన్‌హైమర్, రెస్పెక్ట్ హిందూకల్చర్ అనే హ్యాష్‌ట్యాగ్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
. @OppenheimerATOM To, Mr Christopher Nolan Director , Oppenheimer film
Date : July 22, 2023
Reg: Film Oppenheimer’s disturbing attack on Hinduism
కేంద్ర ప్రభుత్వ సమాచార కమీషనర్ ఉదయ్ మహూర్కర్ ఆ సన్నివేశంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. దర్శకుడు నోలన్‌కు లేఖ రాస్తూ వెంటనే ఆ సీన్ ను తొలగించాలని డిమాండ్ చేశాడు. అటామిక్ బాంబు (Atomic Bomb) పితామహుడిగా జే రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత ఆధారంగా(Real Life story) ఈ మూవీ తెరకెక్కుతోంది.