MNCL: తాండూర్ మండలం బోయపల్లి గ్రామంలో మసాడి రామయ్య జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ని బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావ స్వాతి-రమేష్ బాబు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు. ఇలాంటి టోర్నమెంట్లు గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ వెలికి తీస్తాయన్నారు.