NLG: చింతపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందుతుందని తెలిపారు.