MDK: తూప్రాన్ పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా విధించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నాలుగో వార్డులో కౌన్సిలర్ రాథోడ్ జైపాల్ నాయక్తో కలిసి పర్యటించారు. వార్డులో జరుగుతున్న క్లీనింగ్ పనులను, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పరిశీలించారు.