KMR: బిక్కనూరు మండల కేంద్రంలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న స్టాక్ పూర్తిగా కస్టమర్లకు పంపిణీ చేశామని, కొత్త నిల్వలు లేకపోవడంతో కార్యాలయం వద్ద ‘నో స్టాక్’ బోర్డు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు రమేష్ రెడ్డి తెలిపారు. గ్యాస్ సిలిండర్ల కోసం వచ్చే వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.