W.G: తణుకులోని ఇరగవరం రోడ్డు కాలనీలో పోలీసులు ఇవాళ ఉదయం కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టారు. తెల్లవారుజాము నుంచి నివాసాల్లో సోదాలు చేసి అనుమానితులను విచారించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. CI డి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొని శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించారు.