ప్రకాశం: రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆదివారం కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తి భావంతో స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోవాలని ఆకాంక్షించారు. TTD భక్తులకు చేస్తున్న ఏర్పాట్లు ఆశాజనకంగా ఉన్నాయని అన్నారు.