GNTR: ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో పన్నుల వసూళ్లను మున్సిపల్ అధికారులు వేగవంతం చేశారు. తెనాలి కమిషనర్ రామ అప్పలనాయుడు ఆదివారం సెలవు రోజూ సిబ్బందితో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు. మొండి బకాయిలపై దృష్టి సారించి, నేరుగా బాకీదారుల ఇళ్లకు వెళ్లి పన్నులు చెల్లించాలని కోరారు. ఇప్పటివరకు 75 శాతం మేర వసూళ్లు పూర్తయ్యాయని కమిషనర్ వెల్లడించారు.