GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో 500కు పైగా జనసేన సభ్యత్వాలను నమోదు చేసిన వారిని పార్టీ ఘనంగా సత్కరించింది. తాడికొండ నియోజకవర్గం హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన గల్లా శంకర్రావు 500లకు పైగా మెంబర్షిప్లతో నియోజకవర్గంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆయనను సత్కరించారు.