ప్రకాశం: పామూరు పట్టణంలోని స్థానిక గణేష్‌నగర్ ప్రాంతంలో ఆదివారం సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వాహన పత్రాలను పరిశీలించారు. ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు ఇంటింటా తనిఖీలు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.