»Deepika First Look From Project K A New World In The Eyes
Deepika Padukone: ‘ప్రాజెక్ట్ K’ నుంచి దీపిక ఫస్ట్ లుక్.. కళ్లలోనే కొత్త ప్రపంచం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'ప్రాజెక్ట్ కె' కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. రోజుకో అప్డేట్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ టైం ఫిక్స్ చేయగా.. ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హీరోయిన్గా నటిస్తున్న దీపిక పదుకొనే ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.
మహానటి తర్వాత యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ కెని తెరకెక్కిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ వారు దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. జస్ట్ హ్యాండ్ పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలతోనే హైప్ పెంచుతూ వచ్చారు మేకర్స్. అందుకే ప్రాజెక్ట్ కె టైటిల్, ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పుడా సమయం రానే వచ్చేసింది. జూలై 20న అమెరికాలో జరుగనున్నశాన్ డియాగో కామిక్ కాన్ వేదిక పై ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టుగా.. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్.
భారత కాలమానం ప్రకారం.. ఈ గ్లింప్స్ జూలై 21న రిలీజ్ కానుంది. ‘అల్టిమేట్ షోడౌన్ కోసం ప్రపంచం వేచిచూస్తోంది. జూలై 20న అమెరికా, జూలై 21న ఇండియాలో ప్రాజెక్ట్ కే ప్రపంచాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి’ అని ప్రకటించారు. అయితే దీనికంటే ముందే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న దీపిక పదుకొనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో దీపికా పదుకొనె నాచురల్ లుక్‌తో అదరొట్టేసింది. ఆమె కళ్లలోనే ప్రాజెక్ట్ కె కొత్త ప్రపంచం కనిపించేలా లుక్ డిజైన్ చేశారు. ఆమె స్టైలిష్ లుక్ అదిరింది. అయితే ఇంతకు ముందు ఆమె బర్త్ డే నాడు బ్యాక్ సైడ్ నుంచి ఓ లుక్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పడదే లుక్‌ని క్లోజ్‌లో ఫేస్‌ను రివీల్ చేసినట్టుగా ఉంది ఈ లుక్.
ఇకపోతే శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో అడుగుపెట్టనున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్ కె చరిత్ర సృష్టించనుంది. ఈ ఈవెంట్‌కు ప్రభాస్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ అటెండ్ అవనున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న సినిమాలో అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తుండగా కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 12న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ప్రాజెక్ట్ కెతో ప్రభాస్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.