తమిళ రచయిత, సాహిత్యకారుడు వైరముత్తును 60వ జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. 2025కు సంబంధించిన పురస్కారానికి ఆయనను ఎంపిక చేసినట్లు భారత జ్ఞానపీఠ్ పాలక మండలి ప్రకటించింది. తమిళనాడు తేని జిల్లా మేట్టూర్ జన్మించిన ఆయన.. 1980లో నిళల్గల్ చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మొత్తం 7,500కి పైగా పాటలు రాశారు. 7 జాతీయ, 6 రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలను పొందారు.