BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని జంషెడ్ బేగ్ పెట్ గ్రామంలోని మస్జిద్లో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో MLA గండ్ర సత్య నారాయణరావు పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు ఐక్యతకు ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు రహీమ్, షఫీ, హమీద్, సలీం, సర్పంచ్ శంకర్, ఉప సర్పంచ్ రవి, మాజీ సర్పంచ్ ఓం ప్రకాష్ ఉన్నారు.