సత్యసాయి: రొద్దంలోని విజయలక్ష్మి ఇండేన్ గ్యాస్ గోదామును జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాములోని ఎల్పీజీ సిలిండర్ల నిల్వలను స్వయంగా పరిశీలించి స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. నిల్వలు, రికార్డులు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.