NDL: డోన్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి పి.దివాకర్, అడిషనల్ సివిల్ జడ్జి ఎస్.జ్యోతి ఆధ్వర్యంలో శనివారం నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించారు. సీసీ, ఎక్సైజ్, ఎస్టీసీ, ఓఎస్ వంటి మొత్తం 3,250 కేసులను ఇరుపక్షాల రాజీతో పరిష్కరించామని న్యాయమూర్తులు తెలిపారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమని పేర్కొన్నారు.