అన్నమయ్య: సంబేపల్లి మండలం మోటకట్ల ZPHS పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని BS.పద్మావతికి బెంగళూరులోని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ నుంచి ‘జాతీయ ఉత్తమ విద్యావేత్త’ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా శనివారం ఆమెకు ఘనంగా సన్మానం నిర్వహించారు. డైట్ ఇంఛార్జ్ ప్రిన్సిపల్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నిబద్ధతతో సేవలు అందించినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.