PLD: రాజుపాలెంలోని నేతి వెంకన్న స్వామి తిరుణాళ్లలో తాగునీటి ఇబ్బందులపై ఈవో గణపతి సురేష్ స్పందించారు. మెట్ల మార్గం, టికెట్ కౌంటర్ల వద్ద భక్తుల సూచనల మేరకు వెంటనే పైపులైన్లు వేసి నీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సహకారంతో మినరల్ వాటర్, భక్తుల కోసం బయో టాయిలెట్లు, అన్నదానాన్ని ఏర్పాటు చేశామన్నారు.