MDK: నర్సరీల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తూప్రాన్ డివిజనల్ పంచాయతీ అధికారి యాదయ్య పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో శనివారం తూప్రాన్ మండలం ఇస్లాంపూర్, దాతర్ పల్లి, మల్కాపూర్ నర్సరీలను సందర్శించి పరిశీలించారు. సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కల్పన, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.