MDK: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం కోసం జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలో గ్యాస్ కొరతలపై జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.