SKLM: మాదక ద్రవ్యాలపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని జిల్లా ఏఎస్పీ కేవీ రమణ శనివారం తెలిపారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్‌లో భాగంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 650 ఇళ్లలో తనిఖీలు చేశారు. 456 వాహనాలను పరిశీలించగా 58 వాహనాలను సీజ్ చేశారు.16 అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.