CSK తమ అభిమానుల కోసం ROAR’26 పేరుతో భారీ ఈవెంట్‌ను ప్రకటించింది. ఈ మెగా ఫ్యాన్ ఈవెంట్ మార్చి 22, ఆదివారం సాయంత్రం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఇందులో CSK లెజెండ్స్ మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. వీరు ప్రస్తుత CSK జట్టుతో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తలపడతారు. ఆస్కార్ అవార్డు గ్రహీత A.R రెహమాన్ సంగీత ప్రదర్శన ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.