NGKL: కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో మహిళలకు ఉచిత మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించారు. ఈ మేరకు ఆర్టీసీ డిపో మేనేజర్ సుభాషిని ఉచిత మరుగుదొడ్లను శనివారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలు ఉచితంగా మరుగుదొడ్లు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే ఈ సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు.