తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఆస్థానం జరుగుతుంది. ఈ ఆస్థానంలో సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఆలయంలో మార్చి 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.