AKP: నాతవరం మండలం గాంధీనగరం సమీపంలోని అటవీ ప్రాంతంలో హెడ్ కానిస్టేబుల్ గిరి ఆధ్వర్యంలో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సారా తయారీకి ఉపయోగించే 1400 లీటర్ల బెల్లం పులుపును, సామాగ్రిని ధ్వంసం చేయడం జరిగింది. సారా తయారీ, రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నామని ఎస్ఐ వై.తారకేశ్వరరావు పేర్కొన్నారు.