ATP: రాప్తాడు నియోజకవర్గం కురుగుంట ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో మహిళల కోసం నిర్వహిస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్ ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి ఉచిత ఆరోగ్య సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.