SRD: కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులను శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్ఆర్ఈజీఎస్ కింద నియోజకవర్గంలో రోడ్ల కోసం రూ. 2 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.