ప్రకాశం: అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో వంటగ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్వామి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పటికే మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి స్వామి గుర్తు చేశారు. గ్యాస్ కోసం ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు.