మనుషుల మధ్య గొడవలు జరగటానికి ఈ మధ్య కాలంలో పెద్దగా కారణం ఉండాల్సిన పని లేకుండా పోయింది. కొంతమంది చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టేసుకుంటున్నారు. గల్లీల్లో ఉండే వాళ్ల దగ్గరి నుంచి బెంజి కార్లలో తిరిగే వాళ్ల వరకు ఎవ్వరూ ఇందుకు అతీతం కాకుండా పోయింది. సమాజంలో ముగ్గురు మగాళ్లు కలిసి ఉన్న రెండు శిగలు కలిసి ఉండవు అంటారు .ఇప్పుడు కోల్‌కతా లోకల్లో ట్రైన్ (Kolkata Local Train) ఇలాగే జరిగింది. ట్రైన్ రణరంగంలా మారింది. లేడీస్ కోచ్‌లో మహిళలు అరుపులు.. చెప్పులతో కొట్టుకోవడం.. పిడి గుద్దులతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెట్రో రైళ్ల(Metro trains)లో గొడవలు కామనై పోయాయి. అయితే కోల్కత్తా లోకల్ ట్రైన్లో తాజాగా జరిగిన గొడవ అంతకు మించి అనాలి. ఓ మహిళల గ్రూపు ఒకరినొకరు హింసించుకుంటూ వాదులాడుకున్నారు. ట్విట్టర్ యూజర్ @Ayushihihaha ‘కోల్‌కతా లోకల్’ అంటూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది. అందర్నీ షాక్‌కి గురి చేసింది. మహిళలు చెప్పులతో..పిడి గుద్దులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇతర ప్రయాణికులు వారిని శాంతిపచేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.వారి గొడవకు కారణం తెలియలేదు.. కానీ పబ్లిక్ ప్లేస్‌లో మహిళల గ్రూపు హింసకు పాల్పడటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి గొడవల వల్లే ముంబయి లోకల్ రైళ్లు చెడ్డపేరు సంపాదించుకున్నాయని కొందరు వ్యాఖ్యానించారు. ట్రైన్ లోపల ఉచితంగా ‘WWE’ వంటి వ్యంగ్య కామెంట్లు కూడా చేశారు. ఈ ఘటనపై మరి రైల్వే అధికారులు (Railway officials) ఎలా స్పందిస్తారో చూడాలి.