NLG: దేవరకొండలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ‘యుద్ధం వద్దు శాంతి ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. యుద్ధం వల్ల చమురు ధరలు,గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.