SDPT: గ్రామ అభివృద్ధి కోసం ఉపాధి హామీ పనులను సక్రమంగా అమలు చేయాలని సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దౌల్తాబాద్ మండలం కొనాయిపల్లిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా గ్రామంలో అభివృద్ధి పనులు కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులను సూచించారు.