W.G: తానా సంస్థ ఆద్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా తణుకులో శనివారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఉచిత టార్పాలిన్లు, స్ప్రేయర్లను ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అందజేశారు. అలాగే రైతుల కోసం తానా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు.