SRPT: నడిగూడెం మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామంలో శనివారం అంగన్వాడీ కేంద్రం వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రోగ నిరోధక టీకా’ల కార్యక్రమాన్ని సర్పంచ్ గోసుల రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత టీకా సౌకర్యాన్ని గ్రామస్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.