SRCL: ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో సర్పంచ్ శ్రీ మాచెట్టి లచ్చయ్య ఆధ్వర్యంలో పశువైద్య టీకాల కార్యక్రమం నిర్వహించారు. 75 గేదెలు, ఆవులకు గాలికుంటు టీకాలు, 1500 గొర్రెలకు అమ్మతల్లి టీకాలు, 36 వీధి కుక్కలకు రేబిస్ టీకాలు వేశారు. ఉపసర్పంచ్ గాడిచర్ల శ్రీనివాస్, మపవ అబ్దుల్ వాజిద్, వీఏఎస్ డాక్టర్ నిఖిల, జేవీఓ సుజాత, గోపాలమిత్రలు భాస్కర్ పాల్గొన్నారు.